28న ఆర్యవైశ్య వన సమారాధన

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్26, మధిర:
మధిర మండల ఆర్యవైశ్య వన సమారాధన కార్యక్రమం నవంబర్ 28న పట్టణంలోని ఆత్కూరు అబ్బూరి రామకృష్ణ మామిడి తోటలో నిర్వహిస్తున్నట్లు పట్టణ,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా కిరణ్, దాచేపల్లి ముత్యాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత సంవత్సరం కోవిడ్ కారణంగా వన సమారాధన నిర్ణయించుకోలేదని ప్రస్తుతం ఆర్యవైశ్య సోదరి సోదరుకు కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ వన సమారాధన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు..

అదేవిధంగా నూతనంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఆర్యవైశ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ మునుముందు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. వన సమారాధన కార్యక్రమం లో ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్య్రమాన్ని మధిర పట్టణ, మండల ఆర్యవైశ్య కమిటీ, వాసవి క్లబ్,ఆర్య వైశ్య కళ్యాణ మండపం,ఆర్యవైశ్య యాత్ వాసవి, వనిత క్లబ్ లు కలిసి నిర్వహిస్తున్నాయి.

Mathira Mandala Aryavaishya Vana Samaradhana program will be held on November 28 at Atkur Abburi Mango orchard in the town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube