వనమా రాఘవ విడుదల య్యాడు

కుటుంబం ఆత్మహత్య కేసులో లో ఏ2

1
TMedia (Telugu News) :

వనమా రాఘవ విడుదల య్యాడు

-కుటుంబం ఆత్మహత్య కేసులో లో ఏ2

టి మీడియా, మార్చి 11,కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌రావు (రాఘవ) ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. మండిగ నాగరామకృష్ణకు చెందిన ఆస్తి వివాదంలో జోక్యం చేసుకున్న రాఘవ పెట్టిన వేధింపులను తట్టుకోలేక ఈ ఏడాది జనవరి 3న రామకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించుకుని.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో రామకృష్ణ, అతడి భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితి మృతి చెందారు. ఈ ఘటన తర్వాత రామకృష్ణ తన సెల్ఫీవిడియోలో చెప్పిన విషయాలు, సూసైడ్‌ నోట్‌లో రాసిన విషయాలు బయటకు రావడవంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

Also read : భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!

ఈ క్రమంలో నాగరామకృష్ణ బావమరిది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పాల్వంచ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో వనమా రాఘవను ఏ2గా చేర్చగా.. కొన్ని రోజుల పరారీ అనంతరం ఏపీ వైపునకు పారిపోతున్న క్రమంలో దమ్మపేట మండలంలో ఏపీ సరిహద్దు వద్ద జనవరి 8న అరెస్టు చేశారు. అనంతరం కొత్తగూడెం కోర్టులో హాజరుపరచగా 14రోజులపాటు రిమాండ్‌ విధించి.భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. ఆ తరువాత భద్రతా, ఇతర కారణాల రీత్యా అక్కడి నుంచి నిందితుడిని జనవరి 12న ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. అనంతరం రాఘవ తరపు లాయర్లు పలు మార్లు జిల్లా, హైకోర్టులో బెయిల్‌ కోసం పిటీషన్లు వేయగా తిరస్కరణకు గురయ్యాయి. మళ్లీ ఇటివల మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేయగా గురువారం షరతులతో కూడిన బెయిల్‌ మంజురైంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube