వందే భార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ షురూ

వందే భార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ షురూ

1
TMedia (Telugu News) :

వందే భార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ షురూ

టి మీడియా, నవంబరు 7, చెన్నై : ద‌క్షిణాదిలో తొలి వందేభార‌త్ ట్రైన్ ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభ‌మైంది. చెన్నై-మైసూర్ వందేభార‌త్ ట్ర‌య‌ల్ ర‌న్ చెన్నైలోని ఎంజీ రామ‌చంద్ర‌న్ సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్‌లో సోమ‌వారం ప్రారంభ‌మైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ద‌క్షిణాదిన తొలిసారిగా న‌వంబ‌ర్ 11న ప‌ట్టాలెక్క‌నుంది. ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువ‌ల్ ప్యాసింజ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్ క‌లిగిఉంటాయి.

Also Read : తెలంగాణ లో మునిగి సిన రాహుల్‌ జోడో యాత్ర

వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, క‌మ్‌ఫ‌ర్ట్‌బుల్ సీటింగ్ వంటి సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా రొటేటింగ్ ఛైర్స్ అమ‌ర్చారు. ఈ ట్రైన్ చెన్నై సెంట్ర‌ల్ నుంచి బ‌య‌లుదేరి బెంగ‌ళూర్ సిటీ జంక్ష‌న్ మీదుగా తుది గ‌మ్య‌స్ధానం మైసూర్‌కు చేరుకుంటుంది. మొత్తం 497 కిలోమీట‌ర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంట‌ల 40 నిమిషాల్లో చేరుకుంటుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube