
కమర్షియల్ కు డొమెస్టిక్
– రిఫిల్లింగ్ గాళ్ళకి సరఫరా
-సివిల్ సప్లైయ్ అధికార్లు,డిస్టిబ్యూటర్లు సహకారం
-కోట్లు లో సాగుతున్న వ్యాపారం
టి మీడియా,మే8,నిఘావిభాగం:
వంట గ్యాస్ సరఫరా విషయంలో అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్,కమర్షియల్ సిలెండర్ విధానం లాంటివి తీసుకు వచ్చింది.అమలు విషయం లో సక్రమంగా వ్యవహరించాల్సిన సివిల్ సప్లైయ్ అధికారులు పరోక్ష సహకారం,కొంతమంది డిస్టిబ్యూటర్లు తో పాటు గ్యాస్ కంపెనీ (ఏజెన్సీ)సిబ్బంది చేతి వాటం ప్రద ర్శిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కోటి రు పాయలు వరకు ఉన్నట్లు పరిసలన లో వెల్లడి అయింది.ఈ అక్రమము లో సింహభాగం రిఫిల్లింగ్ కెటు గాళ్ళు , డొమెస్టిక్ సిలెండర్ కమర్షియల్ వినియోగం కు ఇవ్వడం ద్వారా అనేది తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 50 వరకు అధికారిక గ్యాస్ డిస్టిబ్యూటర్లు ఉన్నారు. అనధికారిక ము గా 200 ల వరకు(బెల్ట్ షాప్స్ లాగా)కొంతమంది డిస్టిబ్యూటర్లు కు అనుబంధంగా అనధికారిక ఏజెన్సీలు నడుపుతున్నారు..ఎటువంటి రక్షణ చర్యలు లేకుండానే భారీ సంఖ్యలో సిలెండర్ లు నిల్వ ఉంచుతున్నారు. ఆ విషయం పై శ్రద్దపెట్టాల్సిన అగ్నిమాపక శాఖ అసలు పట్టించుకోదు.అక్రమ నిల్వ దారుల్లో అత్యధికులు గృహ అవసరాల సిలెండర్ నుండి రిఫిల్లింగ్ చేసేవారు .ఈరకం అక్రమార్కులు అత్యధికంగా ఖమ్మం,మధిర,ఇల్లందు,కొత్తగూడెం లలో ఉన్నారు. వీరికి కొంతమంది అధికారిక డిస్టిబ్యూటర్లు నుండి వారి సొంత వాహనాల్లో వారి సిబ్బంది వచ్చి సిలెండర్ లు అందిస్తున్న పరిస్థితి ఉంది.నిత్యం లక్షల్లో ఈ వ్యాపారస్తుల ఆదాయం ఉంటుంది.ఆక్రమార్జన నుండి.. కొంతమంది కి అనధికారిక పరిహారం కప్పం లాగా చెల్లిస్తున్న రు..కొన్నిసందర్బాల్లో పోలీస్ శాఖ దాడులు చేసిన పరిస్థితి లో మార్పు లేదు.చర్యలు తీసుకోవాల్సిన సివిల్ సప్లైయ్ ,తూనికలు కొలతలు శాఖ వారు మిన్నకూడడం అనుమానం కలిగిస్తోంది.
అక్రమము ఇలా..
also read :మహిళ కడుపులో దూది వదిలి కుట్లు వేసిన డాక్టర్లు
గృహవంటగ్యాస్ సిలెండర్ 14.2 కేజీలు ది రు 100లు వరకు ఉంది. కమర్షియల్ సిలెండర్ ధర 19 కేజీల ది 2 వేలు వరకు ఉంది..గృహానిది కేజీ 70 రూపాయలకే లభిస్తుండగా దానిని రి ఫిల్లింగ్ కి వాడి కేజీ 150 నుండి 200లకు అమ్ముకొంటున్నారు.5 కేజీల సికండర్ లో 3కేజీలు నింపి 5కేజీల డబ్బులు వసూలు చేస్తూ బారి మోసానికి పాల్పడుతున్నారు.అంటే ఒక గృహ అవసర సిలెండర్ ని అక్రమ మార్గం లో రిఫిల్లింగ్ చేయడం ద్వారా రు1000లు నుండి 1500లు పొందుతున్నారు ఖమ్మం నగరం లో ఈ తరహా అక్రమ ప్రోత్యహం ద్వారా .ఒక డిస్టిబ్యూటర్ రోజుకు 20 వేలు అంటే నెలకు 6 లక్షలు వరకు అక్రమార్జన కు పాల్పడుతున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి.ఉన్నత స్థాయి కను సన్నలలోనే ఈ అక్రమము సాగుతోంది.అధికారికంగా 5 కేజీల సిలెండర్ ధర 350 రూపాయలు.అంటే కేజీ 50రూపాయలు మాత్రమే.
గ్యాస్ కంపెనీ ల కు చెందిన ఉద్యోగులు పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు ఉన్నాయి.కొంతమంది డిస్టిబ్యూటర్లు కి అనధికారికంగా గ్యాస్ సిలెండర్లు (రికార్డుల్లో లేకుండా) జీరో లో సరఫరా చేస్తున్నారు అనేది తెలుస్తోంది.
వ్యాపార అవసరాలకు..
కొంతమంది వ్యాపార అవసరాలకు గృహ వినియోగదారుల సిలెండర్లు భారీగా సరఫరా అవుతున్నాయి.బడా హోటళ్ళు,బిర్యానీ పాయింట్లు,బేకరీ లకు సరఫరా అవుతున్నాయి.కమర్షియల్ సిలెండర్ అయితే కేజీ ధర అధికారికంగా 100 రూపాయలు ఉంది .గృహ సిలెండర్ ధర కంటే 30 రూపాయలు ఎక్కువ కేజికి 10 రూపాయలు అదనంగా చెల్లించి అనధికారికంగా గృహ సిలెండర్ పొందుతున్నారు.రాష్ట్ర స్థాయి అధికారులు జోక్యం చేసుకొంటేనే ఈ అక్రమము బైటకు వచ్చే అవకాశం ఉంది.