శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం

పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు

1
TMedia (Telugu News) :

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం

-పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు

టీ మీడియా ఆగస్టు 06, శ్రీశైలం :  శ్రీశైలమహాక్షే త్రంలో రెండో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. చంద్రావతి కల్యాణ మండపంలో ఈ జరిగిన వరలక్ష్మి వ్రతంలో వెయ్యి మంది ముత్తయిదువులు పాల్గొన్నారు.

 

Also Read : మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా

 

వీరికి దేవస్థానమే పూజా సామగ్రిని ఉచితంగా అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక పూలు,గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో లవన్న తెలుపగ ఈ వ్రతంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు,ఈవో లవన్న దంపతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube