ఘనంగా శ్రీకాంతచారి వర్ధంతి

ఘనంగాశ్రీకాంతచారి వర్ధంతి

0
TMedia (Telugu News) :

ఘనంగా శ్రీకాంతచారి వర్ధంతి

 

టీ మీడియా, డిసెంబర్ 3, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఓ ప్రవేట్ కార్యాలయంలో మలి దశ తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా పూలమాలవేసి నివాళులర్పిస్తూ శ్రీకాంతాచారి స్మరిస్తూ 13వ వర్ధంతిని జోహార్ జోహార్ ఆయనను స్మరిస్తూ. వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్, మలిదశ ఉద్యమకారుడు మండ్ల దేవన్న నాయుడు వాల్మీకి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు,బుసిరెడ్డి స్వామి, మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలేపి శ్రీకాంతచారి ఆత్మార్పణతో ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చిన వీరుడు శ్రీకాంతాచారి అన్నారు.

Also Read : నేను డాక్టర్‌ అవ్వాలని అమ్మ ఆశపడింది : మంత్రి కేటీఆర్‌

ఒకవేళ నా ఆత్మార్పణతో తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మ ఎత్తి తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణం ఇస్తా అని నినదించిన వీరుడు శ్రీకాంత్ చారి, ఐదు రోజులు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3 /2009 రోజున అమరుడయ్యాడు. ఉద్యమ పోరాట యోధుడు ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారి అని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube