సమైక్యత వారోత్సవాలు జయప్రదం చేయండి :సీపీఎం

సమైక్యత వారోత్సవాలు జయప్రదం చేయండి :సీపీఎం

0
TMedia (Telugu News) :

 

photo
photo

సమైక్యత వారోత్సవాలు జయప్రదం చేయండి :సీపీఎం
టీ మీడియా, సెప్టెంబర్ 15, మధిర: పట్టణంలో సెప్టెంబర్ 16వ తేదీన జరిగే జాతీయ సమైక్యత వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఎం మధిర పట్టణ మండలం కమిటీలకు పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగావారుమాట్లాడుతూ…దేశంలో నేడు ప్రజాస్వామ్యం,లౌకికవాదం,ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటున్నాయని వాటిని కాపాడుకుంటేనే భారత దేశ ఐక్యత ప్రగతి సాధ్యమవుతుందని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో భారత దేశంలో కుల, మత ,ప్రాంతీయ, బాషా, భావనలుకు అతీతంగా ఐక్యమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐక్యత భావం వినిపించిందని ఆ బావన భారతదేశానికి స్వతంత్రాన్ని అందించింది అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల పట్టణ కార్యదర్శులు మందా సైదులు మండవ పన్నింద్రా కుమారి తెలాప్రోలు రాధాకృష్ణ మద్దాల ప్రభాకర్ పాపినేని రామనర్సయ్య పడకంటి మురళి పల్లికంటి విల్సన్ దోర్నాల విజయ్ నారిశెట్టి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube