వాస్తు శాస్త్రం లో దిక్కులకు అధిక ప్రాధాన్యం

వాస్తు శాస్త్రం లో దిక్కులకు అధిక ప్రాధాన్యం

1
TMedia (Telugu News) :

వాస్తు శాస్త్రం లో దిక్కులకు అధిక ప్రాధాన్యం

-ఈశాన్యం, నైరుతి ఇలా 8ఎలా ఉండాలో చూద్దాం

 

టి మీడియా, అక్టోబర్ 15 , హైద్రాబాద్ :వాస్తు శాస్త్రం దిక్కులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒక్కో దిక్కుకు ఒక్కో అధిపతి ఉంటాడని నమ్ముతారు. కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి ప్రాంగణంలో 8 దిక్కులు ఎలా ఉండాలో చూద్దాం. వాస్తును పాటించేవారు దిక్కులను అనుసరించే ఇంటి నిర్మాణాన్ని చేపడతారు. ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకు ఒక్కో అధిదేవత ఉంటారని నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.

also read :బెల్ట్ షాపులు పై దాడులు చేసినఎస్సై  

తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

 

పడమర:
పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరణుడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కు కంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

 

also read :గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు వెళ్లేవారికి నిబంధనలు ఇవే..!
ఉత్తరం:
ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.నవరాత్రులలో దుర్గాదేవి,లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నారా?ఐతే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండినవరాత్రులలో దుర్గాదేవి,లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని కోరుకుంటున్నారా?ఐతే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి

దక్షిణం:
దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తర దిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
ఈశాన్యం:
ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కాబట్టి ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
ఆగ్నేయం:
ఈ దిక్కుకు అధిదేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడటం, స్థిరాస్తులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.
వాయువ్యం:
వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యం కంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు, గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే ఎక్కువగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
నైరుతి:
ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండటం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉంటే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube