పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 2 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం రోజు పట్టణంలోని పెట్రోల్ బంకు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను వెంటనే తగ్గించాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని పుకార్లు పట్టుకొని నిరసన చేయడం జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాశి కల్పన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వాటిని తగ్గించింది. కాకుండా దాదాపుగా 23 రాష్ట్రాలలో కూడా వ్యాట్ను తగ్గించారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకుండా మొండిగా వ్యవహరిస్తోందని వెంటనే వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది.

ప్రజలపై భారం మోపకుండా ఉండాలని కేంద్రం ఆలోచిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా వారి పై భారం మోపుతోందని పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకులను పెరుగుతున్నాయని కాబట్టి వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదని మోడీ ప్రభుత్వం హయాంలోనే మహిళల సంక్షేమ కార్యక్రమాలతో మహిళల నిష్పత్తి పెరిగిందని మహిళల సాధికారత సాధ్యమవుతుందనే ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, బి కృష్ణ, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, అనుజ్ఞ రెడ్డి, కుమార్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత, సుగురు లక్ష్మి, మంజుల, శోభ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube