వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం
వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం
వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం
లహరి, పిబ్రవరి23, వేదాద్రి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల జగ్గయ్యపేట కు 9 కిలోమీటర్ల దూరంలో వేదాద్రి గ్రామం కలదు. వేదాద్రి పక్కనే అనుకోని ఉన్న కృష్ణా నది ఒడ్డున పంచ రూపాలలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం పుట్టుక గురించి వివరాలలోకి వెళితే … క్షేత్రం వెనక ఉన్న పురాణ గాధ వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి ‘కాశీ ఖండం’ లో కనిపిస్తుంది. ఎర్రా ప్రగడ, నారాయణ తీర్థులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు తెలుస్తోంది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో, నరసింహవతారంలో హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని స్వామి చెప్పాడు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాట పడుతుందనీ, అందువలన తాను వచ్చేంత వరకూ ఆ నదిలో సాలగ్రామ శిలలుగా వుండమంటూ అనుగ్రహించాడు. ఆ తరువాత హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.
Also Read : రాజమండ్రిలో కోటి గోటి తలంబ్రాలు సిద్ధం
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం! ఇది కూడా చదవండి : ఆంధ్రా మహావిష్ణు ఆలయం ! శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం వేదాద్రి లోని కృష్ణానదీ తీరంలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి మందిరం ఉన్నది. ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొలా.. నూతన సంవత్సర వేడుకలు! పంచరూపాలలో శ్రీ లక్ష్మినరసింహ స్వామి ముఖ్య దేవాలయములో యోగానంద మరియు లక్ష్మీ నృసింహస్వామి, కొండపైన జ్వాలా నృసింహస్వామి, కృష్ణానది గర్భములో స్నాన ఘట్టమునకు సమీపములో బయటకు కనిపించే రూపం సాలగ్రామము, వేదాద్రికి సమీపములోని గరుడాచల కొండపై వీర నృసింహస్వామి ఉన్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. ‘విశ్వేశ్వరుడు’ క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. కృష్ణవేణి నదిలో విష్ణు నామం వేదాద్రి లో స్వామి దేవేరుల చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లు ఉన్నారు. వీరికి గర్భగుడి పక్కనే ప్రత్యేక ఉపాలయాలు ఉన్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి. మానసిక, శారీరక జబ్బులు ఉన్నవారు ఇక్కడ కొన్నాళ్ళు ఉండి, కృష్ణవేణి నదిలో స్నానం చేసి ఆలయం చుటూ ప్రదక్షిణాలు చేస్తే రుగ్మతలు పోతాయని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6: 30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు .. మధ్యాహ్నం 3:00 నుండి 5:30 వరకు తిరిగి 6:30 నుండి 8 :30 గంటల వరకు. ఆలయం వద్ద కోతులు చిత్ర కృప వసతి సదుపాయాలు వసతి సౌకర్యాలు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సరిపోవు(సత్రాలు ఉన్నప్పటికీ).
Also Read : కాళికాదేవి పరమ భక్తుడు రామకృష్ణ పరమహంస
కనుక భోజనం, వసతి సౌకర్యాలకు జగ్గయ్యపేట సూచించదగినది. గుర్తించుకోవలసినవి వేదాద్రి లో పూలు ఎక్కువగా దొరకవు. కనుక, దేవునికి పూలమాలలు జగ్గయ్యపేట నుండి తీసుకువెళ్ళండి ఆలయం వద్ద కోతుల బెడద ఎక్కువ కనుక జాగ్రత్త. చిత్ర కృప రవాణా సౌకర్యాలు బస్సు మార్గం : విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాల నుండి లోకల్ బస్సులు వేదాద్రి ఆలయం వరకు ప్రతి రోజూ తిరుగుతాయి. జగ్గయ్యపేట నుంచి షేర్ ఆటోలు, జీపులు కూడా దొరుకుతాయి. రైలు మార్గం : వేదాద్రి ఆలయానికి సమీపాన మధిర రైల్వే స్టేషన్ కలదు. అక్కడ తిరిగే లోకల్ బస్సులలో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. విమాన మార్గం : విజయవాడ లోని దేశీయ విమానాశ్రయం వేదాద్రి ఆలయానికి 90 కిలోమీటర్ల దూరంలో కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అలలో ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube