బయ్యారం జడ్.పి.యస్. యస్ లో గంజాయి కలకలం

బయ్యారం జడ్.పి.యస్. యస్ లో గంజాయి కలకలం

1
TMedia (Telugu News) :

బయ్యారం జడ్.పి.యస్. యస్ లో గంజాయి కలకలం

టి మీడియా,నవంబర్ 17,బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని జడ్.పి.యస్.యస్ లో గంజాయి కలకలం రేగింది. పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి వాడుతున్నారంటూ సమాచారం బయటకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు గంజాయి సేవించి తోటి విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఓ గ్రూప్ కు చెందిన విద్యార్థి ఇంకో గ్రూప్ కు చెందిన విద్యార్థిని చంపుతానంటూ బ్యాగ్ లో కత్తిని దాచాడని సమాచారం.ఆ విద్యార్థి వింత ప్రవర్తనను గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారని,ఈ క్రమంలోనే పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకొని అతడి నుంచి కత్తి, గంజాయి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : నూతన హంగులు, అద్భుతమైన దృశ్యం

విషయం బయటకి పొక్కితే స్కూల్ పరువు పోతుందనే భయంతో టి మీడియా,నవంబర్ 17,పాఠశాల సిబ్బంది పోలీసులను మేనేజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విషయమై మీడియా వ్యక్తులను కూడా సదరు ఉపాధ్యాయులు బతిమిలాడినట్లు తెలుస్తోంది.ఇక విద్యాబుద్ధులతో వర్ధిల్లాల్సిన పాఠశాలలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనేది పెద్ద ప్రశ్నగా మారింది.బయట వ్యక్తులు విద్యార్థులకు అలవాటు చేశారా?లేకుంటే ఈ విషయంలో ఎవరైన టీచర్ల పాత్ర ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.ఈ గంజాయి కలకలం వెనక ఎవరున్నారో గుర్తించి వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రలు,టీచర్లు పోలీసులను కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube