గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్
గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్
గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్
టీ మీడియా, ఆగస్టు 02, నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు.గంజాయితరలిస్తున్నారనేవిశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు టాస్క్ఫోర్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
Also Read : వర్షానికి బురదగా మారిన రోడ్లు
తిప్పర్తి పీఎస్ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పద రీతిలో మూడు కార్లలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.వారిని అదుపులోకి తీసుకొని కార్లలో తనిఖీలు చేయగా రెండు వందల కిలోల గంజాయిపట్టుబడిందన్నారు.నిందితులవద్దఐదుసెల్ఫోన్లు,కార్లనుస్వాధీనంచేసుకున్నామన్నారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube