భారీగా పట్టుబడిన గంజాయి

భారీగా పట్టుబడిన గంజాయి

1
TMedia (Telugu News) :

భారీగా పట్టుబడిన గంజాయి
టీ మీడియా ,మే 8,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు సైబరాబాద్‌లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.

Also Read : సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ మీదుగా యూపీకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు యూపీ వాసులు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube