గుమ్మడి కాయలు మాటున గంజాయి రవాణా
-నలుగురి అరెస్ట్..
టీ మీడియా, మే 14,చింతూరు:
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఐపీస్ కు రాబడిన సమాచారం మేరకు, చింతూరు సబ్ డివిజన్ అడిషనల్ ఎస్ పి కృష్ణ కాంత్ ఐపీస్ ఆధ్వర్యంలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గారు ,చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి గారు మరియు సిబ్బంది శనివారం ఉదయం 11 గంటలకు చింతూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనతనిఖీ చేయుచుండగా మోతుగూడెం వైపు నుంచి భద్రాచలం వైపు వెళుతున్న లారీని తనిఖీ చేయగా గుమ్మడికాయలు మాటున 530 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేయుచున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటం జరిగింది.
Also Read : రాజన్నను దర్శించుకున్న డీజీపీ
వారి వద్ద నుండి 530 కిలోల గంజాయిని, 2 సెల్ ఫోన్లు, వెయ్యి రూపాయలు నగదు మరియు లారిని దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది.ముద్దాయిల వివరాలు సౌరవ్ కుమార్ , అలీఘర్ యూపీ రాష్ట్రం,ప్రతాప్ కుమార్,3. కొర్ర సన్యాసిరావు, ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ గ్రామం, 4.కోహ్లీ అర్జున్, ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లాకు చెందినవారుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ కార్యక్రమంలో విఆర్ఓ దూల య్య. ఎ ఎస్ఐ, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube