పోరాటయోధుడు వీర శివాజీ

పోరాటయోధుడు వీర శివాజీ

0
TMedia (Telugu News) :

పోరాటయోధుడు వీర శివాజీ

టీ మీడియా, ఏప్రిల్ 3, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో చత్రపతి వీర శివాజీ 342వ వర్ధంతి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 95వ జయంతి టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ బహుజనుల స్ఫూర్తి ప్రదాత జాతి గర్వించదగ్గ నేత భారతదేశం గర్వించదగ్గ పోరాటయోధుడు మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన రాజుగాడ్ కోటను నిర్మించి బహుజన చక్రవర్తి గొప్ప స్ఫూర్తి ప్రదాత గర్వించదగ్గ మహా పోరాటయోధుడు అన్నారు.

ALSO READ:కొనసాగుతున్న నిరసనలు..

భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం వీరమరణం పొందిన వీర పుత్రుడు దొడ్డి కొమురయ్య ప్రాణత్యాగం ఎన్నో మరెన్నో ప్రజా ఉద్యమాలు ఊపిరి పోసింది. ఆ ఉద్యమ మహానాయకుడు నిత్యం ఉదయించే తొలిపొద్దు దొడ్డి కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు గిరిరాజాచారి, వెంకటస్వామి, సిరివాటి మన్యం, తాడికొండ కృష్ణ, వెంకటేశ్వర్లు, గంధం లక్ష్మయ్య, రాజేష్, చెన్నకేశవులు, గట్టు, గంధం గట్టయ్య, వెంకటయ్య, గంధం నాగరాజు, కొమ్ము బాలస్వామి, రాజేష్ శెట్టి ,వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ;డిసిపి ఇన్చార్జి పోలీస్ అధికారి కి స్వాగతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube