ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసిన ఎస్ ఐ

ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసిన ఎస్ ఐ

1
TMedia (Telugu News) :

ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేసిన ఎస్ ఐ

టీ మీడియా, జూన్ 29, మహానంది:

మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ సమీపంలో నంద్యాల – గిద్దలూరు రోడ్డు వద్ద మంగళవారం ఎస్ ఐ నాగార్జున రెడ్డి ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 30 మందికి జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తమ దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని తెలియజేశారు.అతి వేగంగా వాహనాలు నడుపుతూ హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేస్తామని తెలిపారు

Also Read : ఆత్మకూరు ప్లీనరీ సమావేశానికి వెళ్ళిన వైసిపి నాయకులు

అంతేకాక పలువురు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు హెచ్చరించి పంపించారు. సరైన పత్రాలు లేని వారికి ఫోటో ద్వారా ఫైన్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు.లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు యువతీ యువకులకు వాహనాలు ఇచ్చి బయట తిరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు పై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ హెచ్చరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube