వాహనాల తనిఖీ చేసిన ఎస్ఐ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 23, మహానంది:

మహానంది మండల పరిధిలోని గాజులపల్లి మెట్ట సర్కిల్ వద్ద మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి సరైన పత్రాలు, లైసెన్సులు లేని పలువురి ద్విచక్ర వాహన దారులకు ఫైన్లు విధించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఓక్కరు వాహనాలతో బయటకు వెళ్లేటప్పుడు వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలు, లైసెన్స్, ఉండాలని మరియు హెల్మెట్,తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

లేకపోతే అన్‌లైన్‌లో కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
దయచేసి వాహనదారులు కచ్చితంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వాహనం సంబంధించిన ధ్రువ పత్రాలతో పాటు లైసెన్స్, హెల్మెట్, మాస్కు కచ్చితంగా ధరించి సహకరించాలని ఎస్ ఐ కోరారు.
ఈ కార్యక్రమంలో మహనంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube