టీ మీడియా, అక్టోబర్ 26, వెంకటాపురం (ములుగు)
తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో సోమవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై స్పందించిన మావోయిస్టు అగ్రనేత జగన్ పేరట లేఖను విడుదల చేశారు. లేఖలోని సారాంశం అక్టోబర్ 27న బంద్ పాటించాలని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో భాగంగా వెంకటాపురం సిఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బలగాలతో భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారి పై ఎదిర గ్రామ సరిహద్దులో పోలీసులు డేగ కన్నుతో వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు..
