వాహనాని కి 15 ఏళ్ళు దాటితే

రెన్యూవల్ ఫీ భారీగా పెంపు

1
TMedia (Telugu News) :

వాహనాని కి 15 ఏళ్ళు దాటితే..
– రెన్యూవల్ ఫీ భారీగా పెంపు
టీ మీడియా, మార్చి 14,న్యూఢిల్లీ: మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన ఏదైనా ఒక పాత వాహనం ఉందా? అయితే, మీకో షాకింగ్ న్యూస్​. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్​సీ రెన్యువల్​, ఫిట్​నెస్​ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్​సీ రెన్యువల్​కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అంతేగాక, ఆర్​సీ రెన్యువల్​ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్​లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికేట్ రెన్యువల్​ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్​​ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : తలసాని వర్సెస్ కోమటిరెడ్డి

దిగుమతి చేసుకున్న కార్ల ఆర్​సీ రెన్యువల్​ ఫీజు రూ.15,000 నుంచి రూ.40,000కి పెరిగింది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.

Also Read : బిజెపి అధికారంలోకి వస్తుంది

కొత్త ఫీజులు ఇలా..

వ్యక్తిగత వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజు

వెహికల్​ టైప్​ రిజిస్ట్రేషన్​ ఫీజు రెన్యువల్​ ఫీజు

మోటార్​ సైకిల్:​ 300 1,000

థ్రీవీలర్ : 600 2,500

కారు/జీపు : 600 5,000

ఇంపోర్టెడ్​ వెహికల్:​ 5,000 40,000

కమర్షియల్​ వాహనాల ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ ఫీజు

వెహికల్ టైప్ ఫిట్​నెస్​ ఫీజు రెన్యువల్ ఫీజు

మోటార్ సైకిల్: 500 1,000

థ్రీవీలర్ : 1,000 3,500

ట్యాక్సీ/క్యాబ్​ : 1,000 7,000

మీడియం గూడ్స్​ /ప్యాసింజర్​: 1,300 10,000

హెవీ గూడ్స్​/ప్యాసింజర్:​ 1,500 12,500

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube