మోదీతో ముగిసిన వెంకటరెడ్డి భేటీ

సీఎం కేసీఆర్‌ను కలుస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి

1
TMedia (Telugu News) :

మోదీతో ముగిసిన వెంకటరెడ్డి భేటీ

-సీఎం కేసీఆర్‌ను కలుస్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 16,ఢిల్లీ : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మూసీ నది ప్రక్షాళన కోసం సీఎం కేసీఆర్‌ను కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయిన వెంకటరెడ్డి.. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ, ఇతర అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల గురించి మాట్లాడలేదంటూ వ్యాఖ్యలుప్రధాని నరేంద్ర మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంట్‌లోని పీఎం ఆఫీస్‌లో మోదీతో ఆయన సమావేశమయ్యారు దాదాపు 15 నిమిషాలపాటు మోదీతో ఏకాంతంగా మాట్లాడారు. ఈ భేటీ అనంతరం మీడియాతో వెంకటరెడ్డి మాట్లాడారు.అమెజాన్‌లో డిసెంబర్ 14 వరకు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ 2022రాష్ట్ర రాజకీయాల గురించి మోదీతో ఏమీ మాట్లాడలేదు. ఎన్నికలకు ముందు రాజకీయాల గురించి మాట్లాడతా. ఎంపీగా పోటీ చేస్తానా..? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? అనేది త్వరలోనే చెబుతా. తెలంగాణలోని సమస్యలపై ప్రధాని మోదీతో మాట్లాడా. మూసీ ప్రక్షాళనపై, హైదరాబాద్-విజయవాడ 6 లైన్ల హైవేపై మాట్లాడా. హైవేను విస్తరించాలని ప్రధానిని కోరాను. ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ను యాదాద్రి వరకు పొడిగించాలని కోరాను’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.భువనగిరి కోటకు రోప్‌వే ఏర్పాటు చేయాలని కోరా. ఎన్నికలకు నెల రోజుల ముందే రాజకీయాల గురించి మాట్లాడతా. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా సమస్యలపై మోదీతో చర్చించా. గంగానది తరహాలో మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరా. ప్రస్తుతం నేను కాంగ్రెస్‌లోని ఏ కమిటీలో సభ్యుడిగా లేను’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారుమూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కలుస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

Also Read : దృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం

కేసీఆర్‌ను అయినా కలుస్తానంటూ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్‌ను ఎప్పుడూ విమర్శించే వెంకటరెడ్డి.. అవసరమైతే కలుస్తానంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోనే వెంకటరెడ్డి ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండాలని, జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామంటూ ఖర్గే హామీ ఇచ్చారు. అయినా కాంగ్రెస్‌లో వెంకటరెడ్డి యాక్టివ్‌గా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ వెంకటరెడ్డి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube