వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 27 వెంకటాపురం

ములుగు జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజల ప్రయోజనాల నిమిత్తం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోనీ మహిళ స్త్రీ శక్తి కేంద్రం లో నిర్వహించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పాల్గొని ప్రజలనుండి వివిధ సమస్యల పై ధరకాస్తు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ ప్రజల వద్దకు వారి సమస్యలను పరిష్కరించడం మే లక్ష్యంగా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, గత ప్రజావాణి లో పెండింగ్ ధరకాస్తులకు గల కారణాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి ధరకాస్తు పెండింగ్లో ఉండరాదని జిల్లా అధికారులను ఆదేశించారు.

వెంకటాపురం పరిది లో నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో త్రాగు నీటి కొరత ఉండరాదని, ఆర్ డబ్లు ఎస్ అధికారికి ఆదేశించారు. వివిధ శాఖల అధికారుల తో మాట్లాడుతూ శాఖ పరమైన పనుల పెండింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అట్టి కారణాలని ధరకాస్తు దారులకి తెలియజేయాలని అన్నారు. ఆన్లైన్ ల అటెండెన్స్ యాప్ తప్పని సరి ఉపయోగించాలిని,
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని,హాస్టల్స్ లలో ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని అన్నారు.

కమ్యూనిటీ టాయిలెట్స్, సోక్ ఫీట్స్, సమ్ మామ్ చిల్డ్రన్ ను గుర్తించి పౌష్ఠిక ఆహరం అంచించాలని అన్నారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇఇ మాట్లాడుతూ పాలంపేట, శాపెల్లి రోడ్లను త్వరగ పూర్తి చేయాలని అన్నారు. ప్రజావాణి లో 242 ధరకాస్తు వచ్చాయి. ఎక్కువగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి, పట్టా భూములపైన దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం ఎండార్స్మెంట్ సంబంధిత శాఖల అధికారులకు అందించారు.

కార్యక్రమంలో ప్రజల స్పందన కోరగా సుదూర ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించడం ప్రజల సమస్యలను స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండల ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని మండల ప్రజలు ఆనందాన్ని వెలుబుచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, డిఆర్వో రమాదేవి, ఐటీడీఏ పివో ఓ.వసంత రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల.రవి, ఆర్ అండ్ బి ఇఇ వెంకట్, ఐసిడిఎస్ అధికారిణి ప్రేమలత, ఎస్సివెల్ఫేర్ ఆఫీసర్ పి.భాగ్యలక్ష్మి, డియంఅండ్ హెచ్ ఓ అప్పయ్య, తాహశీల్దార్ అంటి నాగరాజు, ఎంపిడిఓ ఫణిచంద్ర, ఎల్ డియం ఆంజనేయులు, సంబంధిత జిల్లా అధికారులు ఐటీడీఏ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

Collector Krishna Aditya
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube