బైనవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం.

బైనవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం.

0
TMedia (Telugu News) :

బైనవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం.
– బోనాల ఊరేగింపు
-తులబారం
సామూహిక నోముల మహోత్సవం.

టీ మీడియా జనవరి 16 శంకరంపేట

పెద్దశంకరంపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో వేదబ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణలతో… మరోవైపు మంగళవాయిద్యాల చప్పుళ్లతో గోదా సహిత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో పాటు, గ్రామ పెద్దల సమక్షంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవ మండపాన్ని రకరకాల పూలతో, అరటి మట్టెలతో అందంగా అలంకరించారు. గోదా సహిత, శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు వేద బ్రాహ్మణలచే కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పూజారులు క్రిష్ణశర్మ, మహేశ్ కర్మ, నరేష్, అభిలాష్, గుడి రామన్న పంతులు కళ్యాణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి విగ్రహాల తూకంతో సరిపడా బెల్లం, నువ్వులు, తూకంలో ఉంచి తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయా గృహాలనుంచి బక్తులు తరళివచ్చి స్వామివారికి నైవేద్యాలు, ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Also Read:రంగవల్లులతో ఉపాధ్యాయులు నిర

కల్యాణోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

పెద్దశంకరంపేటలో నిర్వహించిన గోదా సహిత శ్రీ లక్ష్మివెంకటేశ్వ స్వామి కల్యాణోత్సవ కార్యక్రమానికి నారాయణఖేడ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరయ్యారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మురళీపంతులు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి షాలువాతో సన్మానించి క్యాలెండర్ అందజేశారు. ఈసందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు షాలువాతో ఘనంగా సన్మానించారు.
వైనవంగ బోనాలు. వెంకటేశ్వర ఆలయం లో మహిళలు బోనాలు ఎత్తుకొని స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి జంగం శ్రీనివాస్,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీపంతులు, ఎంపీటీసీ వీణా సుభాష్గౌడ్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దాదిగారి గంగాధర్, బాధ్యులు టి. రవిందర్, పబ్బ శ్రీనివాస్, రాగం సిద్దు, అనిల్, రాఘవులు, సురేష్ డాక్టర్, నర్సిం పున్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

advt
advt

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube