ప్రభుత్వ స్థలంలో వెంచర్లను స్వాధీనం చేసుకోవాలి

ప్రభుత్వ స్థలంలో వెంచర్లను స్వాధీనం చేసుకోవాలి

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ స్థలంలో వెంచర్లను స్వాధీనం చేసుకోవాలి
టీ మీడియా, ఆగస్టు 1, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లాలో అక్రమ సెల్లులార్ కట్టడాలపై, అక్రమ వంచర్లపై, ప్రభుత్వ స్థలాలలో వెంచర్లు వేసిన వెంచర్లను స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజా వాణిలో ఫిర్యాదుచేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూవనపర్తి జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు పేదవారికి పనిచేస్తాయి కానీ డబ్బులు ఉన్నవారికి కాదు అని నిరూపిస్తున్నారు.

 

Also Read : ముగ్గురు అంతర్ రాష్ట్ర ద్విచక్రవాహన దొంగలు అరెస్ట్

 

మున్సిపాలిటీఅధికారులుఅక్రమకట్టడాలుబహుళఅంతస్తులుతెలంగాణగవర్నమెంట్ తెచ్చిన జీవో ప్రకారం నిర్మించాలి కానీ వనపర్తి పట్టణానికి సంబంధించి ఇష్టానుసారంగా సెల్లోర్లతో నిర్మిస్తూ, పార్కింగ్ సౌకర్యం లేకుండా రోడ్డుపైకి నిర్మిస్తున్నారు.దీంతో మున్సిపల్ అధికారులు వాటిని ఫోటోలు తీసుకుని వాడిని పిలిపించి వారితో డబ్బులు గుంజుతున్నారనివాదనలువినిపిస్తున్నాయి. వారు లంచాలు కట్టి ఇష్టానుసారంగా నిర్మించుచున్నారని, దీని వెనక కొందరు ప్రజాప్రతినిధుల లోపాయికారి ఒప్పందం ఉందని పలువురు పేర్కొంటున్నారని,అలాగే వనపర్తి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న వెంచర్లు చాలావరకు అక్రమంగా వేస్తున్నారని పలుచోట్ల పది ఎకరాలకు గాను రెండు ఎకరాలకు అనుమతి తీసుకొని ఇల్లీగల్ గా 10 ఎకరాల ప్లాట్లు అమ్ముతున్నారని, కొన్ని చోట్ల ప్రభుత్వ భూమినిఆక్రమించుకుని కట్టుకున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఇదేమని అడుగుతే వనపర్తిలో మానిటరింగ్ కమిటీ, విజిలెన్స్ కమిటీ కలెక్టర్ వేయాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఇవన్నీ సాధారణమే అంటూ కమిషనర్ చాలా తేలికగా తీసుకుంటున్న అంశాన్ని పరిశీలిస్తే మీరెంతకు దిగజారారోతెలుస్తుందని,తక్షణమే వాటిపై చర్యలు తీసుకుని, దానికి బాద్యులైన సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కి విన్నవించుకున్నారు.
దీనిపై పళ్ళు రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చామని త్వరలో చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు తెలుపుతామని, ఆ స్థలాలు ఎక్కడిని మమ్మల్ని అడిగిన అధికారులకు వారం రోజుల్లో వాటిని గుర్తించి మీకు చూపిస్తామని వివరంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కోకన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షులు వెంకటేష్, జయరాములు, వైఎస్ఆర్టీసీ సతీష్, రమేష్ లు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube