ఏజెన్సీ ప్రాంతం లో జోరుగా అక్రమ వెంచర్ల దందా

ఏజెన్సీ ప్రాంతం లో జోరుగా అక్రమ వెంచర్ల దందా

1
TMedia (Telugu News) :

ఏజెన్సీ ప్రాంతం లో జోరుగా అక్రమ వెంచర్ల దందా

టి మీడియా, మే 01,మందమర్రి ప్రత్యేక ప్రతినిధి:
ధనార్జనే ద్యేయంగా కొంత మంది రియల్టర్ లు అక్రమ వెంచర్ లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు, మందమర్రి పట్టణం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ 1/70 చట్టం అమలులో ఉంది, ఇక్కడి భూములు గిరిజనయేతరులు అమ్మడం కానీ, కొనడం కానీ చట్ట విరుద్ధం. ఇది తెలియని కొంత మంది జనాలు అక్రమ వెంచర్లలో ప్లాట్లు కనుగోలు చేసి మోస పోవడం జరుగుతుంది, ఈ అక్రమ వెంచర్లు పెట్టిన వారికి కూడా ఎవరు ఎప్పుడు వచ్చి ఈ భూమి నాది అంటారో తెలియదు భయం భయంతోనే ప్లాట్ లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఆ ప్లాట్ కు గ్యారంటీ సంగతి దేవుడు ఏరుగు.

Also Read : బోల్తా పడ్డ కారు.. భారీగా బయటపడిన గంజాయి

మందమర్రి పట్టణ ప్రజలు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకో గలరు, రియల్టర్ ల మాయలో పడి మోస పోకoడి. ఈ మధ్యన ఊరు మందమర్రి చెరువుకు అనుకోని అక్రమంగా వెంచర్ చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు, అది చెరువు శిఖం భూమి(ప్రభుత్వ భూమి)లో ఉంది. ఇదే కాక బురద గూడెం దగ్గర ప్రభుత్వ పాఠశాల వెనుక ఒక అక్రమ వెంచర్ చేసినారు. ఎన్ఫోర్స్మెంట్ టీం సభ్యులైన మునిసిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు వీటి మీద దృష్టి పెట్టి అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాలని, గిరిజన చట్టాలను సంరక్షించాలని పట్టణ కాంగ్రెస్ పేరుతో ప్రకటన చేశారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube