జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

0
TMedia (Telugu News) :

జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

టి మీడియా,డిసెంబర్ 29,హైదరాబాద్‌ : స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ తెలిపింది.హైదరాబాద్‌ బండ్లగూడ లోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ కొనసాగనున్నదని వెల్లడిం చింది.ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నది. 1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తామని స్పష్టంచేసింది.ఈ మేరకు ప్రొవిజినల్‌ లిస్టును విడుద ల చేశామని, అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చామని తెలిపింది.అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రాకపోయినా, కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించకపోయినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Also Read : రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు బర్రెలక్క

వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టులు 7,094కు పెరిగాయి. ఈ నెల 18న ఫలితాలు విడుదల చేసింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube