ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిలువు దోపిడీ

కాంటా పేరుతో కాటేస్తున్న దళారులు

0
TMedia (Telugu News) :

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిలువు దోపిడీ

-కాంటా పేరుతో కాటేస్తున్న దళారులు

టీ మీడియా, ఫిబ్రవరి 9, వరంగల్ : తూకంలో మోసం.. కాంటా పేరుతో కాటేస్తున్న దళారులు.. ఇదీ మార్కెట్‌లో రైతుల పరిస్థితి. ఆరుగాలం పండించిన పంటను నిలువునా దోచేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల మార్కెట్‌లో కాదు.: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిలువుదోపిడీ.. కాంటా పేరుతో కాటేస్తున్న దళారులు.తూకంలో మోసం.. కాంటా పేరుతో కాటేస్తున్న దళారులు.. ఇదీ మార్కెట్‌లో రైతుల పరిస్థితి. ఆరుగాలం పండించిన పంటను నిలువునా దోచేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల మార్కెట్‌లో కాదు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోని రెండవ పెద్ద మార్కెట్. పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్న, వేరుశనగలతో పాటు కందులు, పెసర్లు, బొబ్బెర్లు లాంటి ఎన్నో పంటలు విక్రయించుకోవడానికి రైతులకు కనిపించే ఏకైక మార్కెట్ ఇది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఈ మార్కెట్‌కు పంట వస్తూ ఉంటుంది. అయితే కొనుగోలు పూర్తైన పంట.. కాంటా వేసే క్రమంలో జరుగుతున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. కాంటా మీద ఏమీ పెట్టకపోయినా.. పీఓసీ మెషిన్లలో 13 కిలోల బరువు చూపిస్తోంది. బస్తా వేసిన తర్వాత కూడా అదే 13 కిలోల బరువు చూపించింది. సర్వర్ మొరాయించిందేమో అనుకుని.. కాసేపు కాంటా వేయడం ఆపేశారు.

Also Read : విడాకుల కోసం పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టిన భర్త.

కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాంటాలు మొదలుపెట్టినా మళ్లీ అదే తీరు.సాంకేతిక లోపం కారణంగా పీఓసీ మిషన్లు, తూకంలో తేడా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ల పనితీరుపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తమ గోడు వినిపించుకునే నాధుడే లేడని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి కొత్త పీఓసీ మెషిన్లు ఇస్తే త్వరగా కాంటాల్లో మోసాలు అరికట్ట వచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని పీఓసీ మెషిన్లు పని చేయడం లేదన్నమాట వాస్తవమేనని, కొన్నిట్లలో తూకంలో కూడా తేడా వస్తుందని తమ దృష్టికి వచ్చిందన్నారు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాహుల్. ఈ మిషన్లకు మరమ్మత్తులు చేపిస్తామనీ.. త్వరలోనే కొత్త వాటిని కొనుగోలు చేస్తామంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube