వెటరన్ క్రీడాకారుడు శంకర్ కు సన్మానం

వెటరన్ క్రీడాకారుడు శంకర్ కు సన్మానం

2
TMedia (Telugu News) :

వెటరన్ క్రీడాకారుడు శంకర్ కు సన్మానం

టి మీడియా,ఏప్రిల్ 09, గోదావరిఖని :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 3న జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో 75సంవత్సరాలు పైబడిన విభాగంలో గోదావరిఖనికి చెందిన వెటరన్ క్రీడాకారుడు దామెర శంకర్ పాల్గొని డిస్కస్ త్రో లో బంగారు, జావెలిన్ త్రో, షాట్ ఫుట్ లో వెండి పతకాలు సాధించారు.ఈ సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీలోని ఒక రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్ లో నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుత… శంకర్ ఈ వయస్సులోనూ ఆరోగ్యకరమైన అలవాట్లతో శారీరక ధృఢత్వాన్ని కాపాడుకొంటూ, క్రీడల్లో పాల్గొంటూ, వయస్సనేది ఒక సంఖ్య మాత్రమేనని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

Also Read : రూ.3 .90 కోట్లుతో ఇంటిగ్రేటెడ్ మార్కెట

జాతీయ స్థాయిలో జరుగబోయే టోర్నమెంట్ లో సైతం మరిన్ని పతకాలు సాధించి, మన ప్రాంతానికి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో నియర్ అండ్ డియర్ నిర్వాహకులు పి.ఎస్.అమరేందర్, సీహెచ్.ఉపేందర్, వంగ శ్రీనివాస్ గౌడ్, మేజిక్ రాజా, సంజయ్ కుమార్, కిషన్ రావు, మురళీధర్ యాదవ్, అందె సదానందం, గాదం నందు,మొగరం గట్టయ్య, బెందె నాగభూషణం గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,గాజుల రమేష్, సందీప్,వంశీ, ప్యాట్రిక్,సంజీవ రావు, శ్రీనివాస్ రెడ్డి, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube