చదరంగం పోటీలను ప్రారంభించిన వైస్ చైర్మన్
టీ మీడియా, జనవరి 13, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రంగస్వామి స్మారక చదరంగం పోటీలను సిల్వర్ జూబ్లీ క్లబ్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.ఈ పోటీలను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 13,14 రెండు రోజులు జరిగే ఈ పోటీలలో సీనియర్స్ జూనియర్స్ జూనియర్స్ మొత్తం 80 జట్లు పాల్గొన్నాయి. మొత్తం సీనియర్స్ కు మొదటి మూడు స్థానాల్లో నిలిచినటువంటి జట్లకు ఐదు తులాలు, మూడు తులాలు, రెండు తులాలు వెండి నాణాలను బహుకరించబడును. అదేవిధంగా జూనియర్స్ కు మూడు తులాలు, రెండు తులాలు, ఒక తులం వెండి చొప్పున బహుకరించబడును. ఈ సందర్భాన్ని ఉద్దేశించి వాకిటి శ్రీధర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ క్రీడను నేర్చుకోవాల్సిందిగా కోరారు. దీని ద్వారా విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని లేదు మేధోశక్తి ఆలోచన విధానం పెరుగుతుందని తెలియజేశారు.
Also Read : ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ నెంబర్ ఆవుల రమేష్, జనరల్ సెక్రటరీ యాదగిరి, ట్రెజరర్ మెగా రెడ్డి, పోటీల కన్వీనర్ టివి కృష్ణయ్య కృషి చేసిన రంగస్వామి మిత్రులు సత్యనారాయణ,రాంప్రసాద్, రంగసామి సోదరులు నరసింహగా గణేష్, పీఆర్టియు జిల్లా అధ్యక్షులు మైపాల్ రెడ్డి, జిహెచ్ఎం చంద్రశేఖర్, మదిలేటి, శ్రీనివాసులు, బుచ్చిబాబు, కవి గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను జిల్లాస్థాయి పోటీలు నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను నిర్వాహకులను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube