బార్ షాప్ వర్కర్స్ ను పనిలోకి తీసుకోవాలి .

0
TMedia (Telugu News) :

– లక్ష్మినారాయణ ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు

టీ మీడియా, నవంబర్ 25, మణుగూరు:

మణుగూరు లో బార్ షాప్ వర్కర్స్ ను పనిలోకీ తీసుకొని వారికి ఉపాధి కల్పించాలని జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు . రెండు సంత్సరకాలంగా కరోనా దెబ్బ తో కొంతమంది ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని , మద్యం దుకాణాలు ద్వారా ప్రభుత్వానికి , కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దాని కోసం పని చేస్తున్న కార్మికుడికి ఉపాధి లేకుండా పోతుందని వారు ఆరోపించారు, రెండు సంవత్సరాలుగా పని లేకుండా రోడ్డున పడ్డ బార్ షాప్ వర్కర్స్ ను విధుల్లోకి తీసుకొని వారికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి సుధాకర్‌, బార్ షాప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వుసికేల, కొండలరావు, పగిదయ్య రవి, వేంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు .

Vice President R.Lakshminarayana demanded that bar shop workers be hired and employed in Manuguru.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube