టి మీడియా, డిసెంబర్ 14 వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు వెంకటాపురం టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచుకొని అభినందనలు తెలియజేశారు. అధ్యక్షుడు గంపా రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లొ ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ పార్టీదే విజయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పాయం రమణ , మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిడెం యమిలి, సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, బాలసాని శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి దామోదర్, ఉపాధ్యక్షులు గాందెర్ల. నాగేశ్వరరావు, సర్పంచ్ సూరిబాబు టౌన్ ప్రెసిడెంట్ చిడెం నాగేశ్వరరావు ఎం పి టి సి కురసం సమ్మక్క రైతు సంఘం అధ్యక్షులు ముత్తయ్య , శివాజీ యాదవ్ మద్దుకూరి ప్రసాద్ , శాంత మూర్తి యాదవ్ బాలసాని మధు, మాంత్తయ్య , ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.