పేద విద్యార్ధుల తలరాత మార్చేందుకే విధేశీ విద్యా దీవేన

పేద విద్యార్ధుల తలరాత మార్చేందుకే విధేశీ విద్యా దీవేన

0
TMedia (Telugu News) :

పేద విద్యార్ధుల తలరాత మార్చేందుకే విధేశీ విద్యా దీవేన

– సిఎం జగన్‌

టీ మీడియా, డిసెంబర్ 20, అమరావతి : జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి రూ.41.59 కోట్లను.. బటన్‌ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ … అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్‌ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గంటున్న వారందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదన్నారు. మన తల్లిదండ్రులకు, మనకు ఎలాంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుందని, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నామని సిఎం చెప్పారు.

Also Read : చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా.?

చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బందిపడకూడదని సిఎం జగన్‌ అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడకూడదని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని జగన్‌ చెప్పారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని తెచ్చామన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని వివరించారు. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్‌ ర్యాకింగ్స్‌ లో గానీ టాప్‌ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్‌ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్‌ ఫీజు చెల్లిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినవారికి రూ.కోటీ 25 లక్షల వరకు, మిగిలిన వారికి రూ.కోటి వరకు తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోందన్నారు. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నామని తెలిపారు.

విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటివరకు చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్‌ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నామన్నారు. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ” ఈ పథకం ఎంత సంతఅప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్‌. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్‌ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి.” అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube