సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్ఐ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం:

ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ (ఐపీఎస్) ఆదేశానుసారంగా గ్రామీణ ప్రాంతంలో సైబర్ నేరస్థులు లక్ష్యంగా పెట్టుకున్నారని,సైబర్ నేరాలకు సంబంధించిన విభాగంవారు పూర్తి సమాచారం కోసం ప్రతి రోజు అందించుటకు గాను 7901145673 సైబర్ ఫ్రెండ్ ఈ నంబర్ను మీ యొక్క విలేజ్ గ్రూప్,ఫ్రెండ్స్ గ్రూప్,బంధువుల గ్రూప్,అన్ని ఇతర గ్రూపులు నందు యాడ్ చేసుకోగలరని తెలిపారు.ఈ నెంబర్ మీ యొక్క గ్రూప్స్ నందు వున్నట్లైతే మీకు ప్రతి రోజు జరిగే కొత్త కొత్త సైబర్ నేరాలు,మోసపోయే పద్దతులు వాటి నివారణ అంశాలు అవరనేస్స్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతిరోజు సమాచారం అందించబడునని,ఒకవేళ ఏదైనా సైబర్ నేరం జరిగినట్లైతే వీలైనంత త్వరగా టూల్ ఫ్రీ నెంబర్ 155260 కి ఫోన్ చేసి,మీ యొక్క ఫిర్యాదును నమోదు చేసినట్లైతే మీ యొక్క కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఎస్ఐ సూచించారు.

Praveen kumar said that people should be vigilant in the face of high inicidence of cyber crime.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube