టీ మీడియా డిసెంబర్ 16 వనపర్తి :వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 జరిగి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా విజయ్ దివాస్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఏఐసిసి కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ నేడు విజయ్ దివాస్ 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వనపర్తి పట్టణంలో డిసెంబర్ 16వ తేదీ భారత జవాన్లను గుర్తు చేసుకోవడం జరిగింది.
భారత దేశంతో పాటు పొరుగు దేశాలైన పాకిస్థాన్ బంగ్లాదేశ్ చాలా చిరస్మరణీయమైన ఈ రోజు భారతదేశం బంగ్లాదేశ్ గర్వంగా తలఎత్తుకునే రోజు పాకిస్తాన్ తల దించుకున్న రోజు పాకిస్తాన్ తల దించుకున్న రోజు 1971 లో పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించింది .తూర్పు పాకిస్థాన్ అని పిలిచేవారు. పాకిస్తాన్ విజయాన్ని భారత్ విజయం జరుపుకుంటుంది 50 ఏళ్ల క్రితం ఇదే రోజున పాకిస్తాన్ రెండు ముక్కలైంది పాకిస్తాన్ సైతం భారతదేశం పరాక్రమం ముందు లొంగిపోయింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి ,శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, సహదేవ్ యాదవ్, అనీష్ ,రాధాకృష్ణ, బ్రహ్మం, కృష్ణబాబు, కోట్ల రవి, చంద్రమౌళి, బాబా, డి వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, గణేష్ గౌడ్, త్రినాధ్,దిలీప్, రోహిత్, మన్యంకొండ, రాములు, లక్ష్మయ్య, డి విజయ్, సందీప్, శివ కుమార్ ,కుమార్ ,నాగన్న, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.