జీవితంలో ఎదగటానికి అంగ వైకల్యం ప్రతిబంధకం కాదు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 03, మధిర:

జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోవటానికి, అంగ వైకల్యం అవరోధం కాదని ఎం.డి.ఓ. విజయ భాస్కరరెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మధిర భవిత కేంద్రం ఆధ్వర్యంలో ధివ్యాంగుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు.అనంతరం ఎం.డి.ఓ.విజయ భాస్కర్ రెడ్డి దివ్యాంగుల తల్లి తండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ…ప్రభుత్వం అందచేస్తున్న సహాయం తల్లితండ్రుల సహకారంతో తమ లోపాలను సరిదిద్దుకుంటూ, తమకు సరిగా ఉన్న అవయవాలను, సద్వినియోగం చేసుకావాలని కోరారు.శరీరం అంతా చచ్చుబడి, చేతి వేళ్ళు, మెదడు మాత్రమే ఉపయోగించుకునే అవకాశమున్న స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రజ్ఞుడుగా పేరు ప్రత్యేక తెచ్చుకున్నారని తెలిపారు.

అదేవిధంగా గత సంవత్సరం నుండి సేవాసదనం సూపర్వైజర్ గా వ్యవహరిస్తూ ఎందరో దివ్యాంగులకు సేవలందిస్తున్న దివ్యాంగుడు కుమార్ మీకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఈ సందర్భంగా కుమార్ ను టౌన్ ఎస్.ఐ. సతీష్ కుమార్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్.ఐ. సతీష్ కుమార్, పుతుంబాక కృష్ణప్రసాద్, మాధవరపు నాగేశ్వరరావు, వై.పద్మావతి, పుల్లఖండం చంద్రశేఖర్, ఎస్.వి.ఆర్, భవిత కేంద్రం ఉపాధ్యాయులు, మురళి కృష్ణ, హుస్సేన్, జ్యోతి, సరిత, విద్యార్థులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Vijaya Bhaskarareddy said , On the occasion of International Paralysis Day on Friday, a rally under the auspices of Madhira Bhavita Kendra.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube