అదరగొట్టిన అకాడ

ఎన్టిపిసి లో ఘనంగా దసరా ఉత్సవాలు

1
TMedia (Telugu News) :

అదరగొట్టిన అకాడ

 

– ఎన్టిపిసి లో ఘనంగా దసరా ఉత్సవాలు

– అబ్బురపరచిన చిన్నారుల విన్యాసాలు

టీ మీడియా,అక్టోబర్ 6, గోదావరిఖని : ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో విజయదశమి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ హనుమాన్ హకాడ ప్రదర్శన వైభవంగా జరిగింది.విద్యార్థిని విద్యార్థులు చిన్నారులు యువకులు ప్రదర్శించిన పలు విన్యాసాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కీర్తిశేషులు కంది రాజయ్య అకాడ వస్తాద్ జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు నిర్వహించిన అకాడ ప్రదర్శనను స్థానిక కార్పొరేటర్లు రమణ రెడ్డి కుమ్మరి శ్రీనివాస్ ఎన్ టి పి సి ఎస్ ఐ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని అకాడ ప్రదర్శనను ప్రారంభించారు.

Also Read : బీ.ఆర్.ఎస్ గా నామకరణం కార్యాలయాల్లో స౦బరాలు 

గత ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ..ప్రాచీన యుద్ధకళ అడుగంటి పోకుండా నేటి తరానికి,విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అకాడలో శిక్షణను ఇచ్చి దసరా ఉత్సవాలలో భాగంగా ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని మాస్టర్ కంది నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా కంది నాగరాజు మాట్లాడుతూ… తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అకాడ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి,కుమ్మరి శ్రీనివాస్,కంది చంద్రయ్య, కుమ్మరి రాములు,శ్రీకాంత్, కంది మల్లికార్జున్, కంది గాంధీ,ముత్యాల సాయిరాం,కంది సాగర్, పవన్,శ్రీ సాయి,క్షేత్ర, శివాని,సిరివెన్నెల, హరిణి, స్ఫూర్తి,సాయి,రక్షిత్, విశాంత్,మని,రక్షిత్, విశ్వాస్,మంద శ్రీకాంత్, కీర్తన్,అభిరామ్,శ్రీను, సూర్య,అంకుష్ విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube