రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడి

1050 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం_

2
TMedia (Telugu News) :

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడి

-1050 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం_

-రూ.20 లక్షల బియ్యం, మూడు ఆటోల సీజ్‌_

-లీజుదారుడు పై 6ఏ కేసు

-ప్రకాశం జిల్లా నుంచి బియ్యం తరలిస్తున్నట్లు గుర్తింపు

టీ మీడియా,సెప్టెంబర్ 7,వినుకొండ(పల్నాడు జిల్లా ): రాశులు రాశులుగా పోసిన రేషన్‌ బియ్యం గుట్టలు. ఆ గుట్టలను చూసి తనిఖీలకు వచ్చిన విజిలెన్స్‌ అధికారులే విస్తుపోయారు. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు మండలంలోని గోనుగుంట్లవారిపాలెం సమీపంలోని శ్రీనిధి రైస్‌ మిల్లు సమీపంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం అర్ధరాత్రి మాటు వేశారు. ఆ సమయంలో బొలెరో ఆటోల్లో శ్రీనిధి రైస్‌మిల్లుకు పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించడాన్ని గమనించారు. ఈ క్రమంలో మిల్లుపై అధికారులు దాడి చేసి తనిఖీలు చేశారు. అక్కడ రాశులు, రాశులుగా పోసి ఉన్న పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించారు.

Also Read : పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి వేముల రామూర్తి.

1050 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.20 లక్షలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.   ఇంకా ఎక్కడైనా బియ్యం దాచి ఉన్నారా అని ఆరా తీశారు.  రైస్‌ మిల్లు లీజుదారుడైన సూరె రామకృష్ణసాయికుమార్‌పై 6ఎ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ మాధవరెడ్డి విలేకర్లకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక రెవెన్యూ అధికారులసాయంతో సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పజెప్పామన్నారు.

Also Read : రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’..

ప్రకాశం జిల్లాలోని కురిచేడు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల నుంచి ఆటోల్లో మిల్లుకు రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే 8008203288 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ లక్ష్మారెడ్డి, తహసీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు, స్థానిక తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, సీఎస్‌డీటీ విద్యాసాగర్‌ తదితరులు ఉన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube