వెల్టూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి

వెల్టూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి

0
TMedia (Telugu News) :

వెల్టూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి

టీ మీడియా, సెప్టెంబర్ 16, వనపర్తి బ్యూరో : వెల్టూర్ గ్రామాన్ని మండలంగా చేయాలని జెఏసి నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని శుక్రవారం తెలుగుదేశం పార్టీ బృందం మద్దతు తెలియజేసింది.ఈ సందర్భంగా టిడిపి జిల్లా పట్టణ అధ్యక్షులు బి.రాములు, నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ వెల్టూర్ గ్రామాన్ని మండలంగా చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలను తెలుగుదేశం ఎంఎల్ఎ రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిపించారని 120కె.వి సబ్ స్టేషన్,హై స్కూల్,వెటర్నరీ ఆసుపత్రి,అన్ని గ్రామాలకు రహదారులు రావుల హాయములో జరిగినాయని అన్నారు.మండల వ్యవస్థ ఎన్టిఆర్ తీసుకొచ్చిన తర్వాత మండల్లాలతో పాటు వెల్టూర్ గ్రామాన్ని అభివృద్ధి రావుల చేశారని కాబట్టి ప్రజల న్యాయమైన కోరికను మన్నించి ప్రభుత్వం మండలంగా ప్రకటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దస్తగిరి, గౌస్,వహీద్,బాలరాజుస్థానిక తెలుగుదేశం జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube