వాడవాడలా కొలువుదీరిన గణనాథుడు

పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

1
TMedia (Telugu News) :

వాడవాడలా కొలువుదీరిన గణనాథుడు

-పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

టీ మీడియా, సెప్టెంబర్02,తిరుమలాయపాలెం:

మండల పరిధిలోని పలు గ్రామాల్లో వాడ వాడల అలంకరించిన మండపాలలో గణనాథుడు కొలువుదీరాడు గణనాథుడికి ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పిండిప్రోలు తిరుమలాయపాలెం కొక్కిరేణి ఎర్రగడ్డ తాళ్ళచెరువు బీరోలు కాకరవాయి బచ్చోడు జూపెడ సుబ్లేడు హైదర్ సాయి పేట జల్లేపల్లి పాతర్లపాడు వేదుల చెరువు గ్రామాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఘనంగా మండపాలను అలంకరించారు. కొక్కిరేణి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు భాగంగా వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న ఎంపీపీ బోడ మంగీలాల్ మండల రైతుబంధు కన్వీనర్ చావశిరామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించరు.

 

Also Read : గీత కార్మికులకు గీత బంధు అమలు చేయాలి

మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మండల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక సర్పంచ్ గంట నిర్మలకృష్ణ, ఎంపీటీసీ అంబేడ్కర్, ఉప సర్పంచ్ సిరి గద్దె ఉపేందర్,మండల కో. ఆప్షన్ సభ్యులు షేక్. సైఫుద్దీన్, గ్రామశాఖ అధ్యక్షులు కర్నాటి. రాజేంద్ర ప్రసాద్, గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు గుగ్గిళ్ళ అశోక్, గద్ధల వెంకటేశ్వర్లు, చావా సాంబయ్య , కర్నాటి శ్రీను, మైదం. నాగేశ్వర రావు, దొడ్డి చలం, బొండ. నాగేశ్వర రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube