కరోనా నిబంధనలు ఉల్లంఘించిన సీఎం ఠాక్రే..

పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత

1
TMedia (Telugu News) :

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన సీఎం ఠాక్రే..

-పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత
టి మీడియా, జూన్ 23,ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై ముంబైలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. పార్టీలో తిరుగుబాటుతో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న సీఎం ఠాక్రేపై.. కరోనా నిబంధనలు అతిక్రమించారని బీజేపీ నేత తేజిందర్‌ పాల్‌ సింగ్ బగ్గా ముంబైలోని బలబార్‌ హిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఠాక్రేకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో రాజకీయ అస్తిరత ఏర్పడిన నేపథ్యంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి.. సొంతిళ్లు మాతోశ్రీకి చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలిశారు.

Also Read : మద్దునూరు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ జి.రవి

కారులో వెళ్తూ వారికి అభివాదం చేశారు. ఇలా చేయడం కరోనా నిబంధనలకు విరుద్ధమని, మహమ్మారి బారినపడిన సీఎం.. ప్రొటోకాల్‌ ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలని, ఎవ్వరినీ కలవడానికి వీళ్లేదని బగ్గా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంప్లెయింట్‌ కాపీని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube