ఖమ్మం లో విప్ రేగా

ఖమ్మం లో విప్ రేగా

2
TMedia (Telugu News) :

ఖమ్మం లో విప్ రేగా

– పలువురి తో గెట్ టు గేదర్

– దీపావళి గిఫ్ట్ ప్యాక్ లు అందుచేత

టీ మీడియా,అక్టోబర్ 23,ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు,పినపాక ఏం ఎల్ ఏ,ప్రభుత్వ విప్ రేగ కాంతారావు ఆదివారం నగరం లోని లకారం సమీపం లోని హోటల్ లో ఖమ్మం వాసులు కొంత మంది తో గెట్ టు గెదర్ నిర్వహించారు. పరిమితం గా మీడియా ప్రతినిధులు ను కూడా ఈ కార్యక్రమానికి రేగ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి స్వీట్లు ప్యాకెట్ తో కూడిన గిఫ్ట్ ప్యాక్ అంద చేశారు.లంచ్ కూడా చేయించారు అంతకు ముందు ఇష్టా గోష్ఠి చర్చ చేశారు .కొంత మంది తో వ్యక్తి గతం గా కూడా మాట్లాడరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన మీడియా ప్రతినిధులు కొంత మంది నీ ఆహ్వానించ గా తాము ఖమ్మం కు రాము అని స్పష్టం చేసి నట్లు అక్కడి మీడియా ప్రతినిధి ఓకరు టి మీడియా కి తెలిపారు.ఇది ఇలా ఉంటే రేగ నగరంలో గెట్ టు గేదర్ నిర్వహణ పై ఆసక్తి కర చర్చ సాగుతోంది.దీపావళి మందులు భద్రాద్రి కొత్త గూడెం షాప్ ల వద్దవా . ? ఖమ్మం లోనివా..భారీగా ప్యాక్ లు చేయడం ,నిల్వ చేయడం పై కూడా చర్చ ఉంది.మన్యం పేరుతో పత్రిక,ఛానల్ కూడా రేగ నిర్వహణ లో ఉన్నయి.మీడియా సంస్థ పని విషయం పై కూడా ఈ సందర్భంగా చర్చించి నట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube