ఏపీ కొత్త రాజ‌ధాని విశాఖ‌ప‌ట్ట‌ణం : సీఎం జ‌గ‌న్‌

ఏపీ కొత్త రాజ‌ధాని విశాఖ‌ప‌ట్ట‌ణం : సీఎం జ‌గ‌న్‌

0
TMedia (Telugu News) :

ఏపీ కొత్త రాజ‌ధాని విశాఖ‌ప‌ట్ట‌ణం : సీఎం జ‌గ‌న్‌

టీ మీడియా, జనవరి 31, న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్ట‌ణం ఉండ‌బోతుంద‌ని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ డిప్లమాటిక్ అలియ‌న్స్ మీట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉన్న విష‌యం తెలిసిందే. డిప్ల‌మాటిక్ మీట్‌కు హాజ‌రైన ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. విశాఖ‌ప‌ట్ట‌ణం మా రాష్ట్రానికి కొత్త రాజ‌ధాని కాబోతున్న‌ద‌ని, ఆ ప‌ట్ట‌ణానికి మీరంతా రావాల‌ని ఇన్విటేష‌న్ ఇస్తున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే తాను కూడా విశాఖ‌కు షిఫ్ట్ కాబోతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఏపీతో బిజినెస్ చేసేందుకు మీరంతా రాష్ట్రానికి రావాల‌ని ఆయ‌న ఆహ్వానం అందించారు.

Also Read : హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube