సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్

ఖచ్చితమైన కార్యాచరణతో పూర్తి చేయాలని ఆదేశం

1
TMedia (Telugu News) :

సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్
– ఖచ్చితమైన కార్యాచరణతో పూర్తి చేయాలని ఆదేశం
టీ మీడియా,సెప్టెంబర్ 5,ఖమ్మం: సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. కలెక్టర్ అన్ని బ్లాకులు తిరిగి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్, తదితర సివిల్ పనులు పూర్తయినట్లు తెలిపారు. ఫాల్ సీలింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు తుది దశలో ఉన్నాయని ఆయన అన్నారు. రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

Also Read : బియ్యం వితరణ

నిర్మాణ పనులు వెంటనే ఖచ్చితమైన కార్యాచరణతో పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కలెక్టరేట్ కార్యాలయం వైద్య కళాశాల నిర్వహణకు కేటాయించినట్లు, ఈ సంవత్సరం తరగతుల ప్రారంభానికి చర్యలు చేపడుతున్నందున పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube