విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన

1
TMedia (Telugu News) :

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన

టీ మీడియా, జులై 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో గురువారం విశ్వబ్రాహ్మణుల గురించి కేటీఆర్ విశ్వబ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున శుక్రవారం రాజీవ్ చౌక్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ముమ్మడి పరమేశ్వర చారి మాట్లాడుతూ అయ్యా కేటీఆర్ తెలంగాణ ఏర్పడడానికి మా జాతి ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ కెసిఆర్ కి నీళ్లు నిధులు నియామకాలు లెక్కలు చెప్పిన మా విశ్వబ్రాహ్మణ జాతి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ హాస్పిటల్లో ఉండి నిరాహార దీక్ష విరమించుకునే సమయంలో విశ్వబ్రాహ్మణ జాతిరత్నం కాసోజు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్నా మా జాతి గురించి ఆచారి పప్పుచారి గొట్టంగాళ్లు అనే మాటలు నీవు తక్షణమే వెనక్కి తీసుకోవాలి.

Also Read : ప్రజా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్

 

లేనిపక్షంలో మీ టిఆర్ఎస్ పైన మా విశ్వబ్రాహ్మణ జాతి నిరసన పోగ్రాములు నిరాహార దీక్షలు చేయడానికి అయినా సిద్ధం అప్పటికి వినని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ పి బ్రహ్మచారి, స్టేట్ కమిటీ సభ్యులు సత్యనారాయణ చారి, సూర్య ప్రకాష్ ఆచారి, మాధవాచారి, రామాచారి, వెంకటేష్ ఆచారి, శంకరాచారి, మోనాచారి, నాగరాజు చారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube