వివేకా హత్య కేసు… తదుపరి విచారణ వాయిదా

వివేకా హత్య కేసు… తదుపరి విచారణ వాయిదా

0
TMedia (Telugu News) :

వివేకా హత్య కేసు… తదుపరి విచారణ వాయిదా

టీ మీడియా, డిసెంబర్ 15, హైద‌రాబాద్ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన శివశంకర్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ పై సిబిఐ కౌంటర్‌ దాఖలు చేసింది. మరోవైపు వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సునీత ఇంప్లీడ్‌ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది.

Also Read ఒక మహిళగా స్మృతి ఇరానీ అలాంటి వాఖ్యలు చేయడం సరికాదు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube