వారిద్దరూ ఓకే గూటి మాజీ పక్షులు

వారిద్దరూ ఓకే గూటి మాజీ పక్షులు

0
TMedia (Telugu News) :

 

Madhu

 

వారిద్దరూ ఓకే గూటి మాజీ పక్షుల

-రాజకీయ వాన మాలు అక్కడే ..

-ఖమ్మం స్థానిక ఎమ్యెల్సి లో రసవత్తర పోరు

టీ మీడియా, నవంబర్ 22, ఖమ్మం: వారిద్దరూ ఓకే గూటి పక్షులు. ఒకప్పుడు మంచి మిత్రులు,ఒక్కరి వద్ద నే రాజకీయ వానమాలు నేర్చుకున్నరు.పాత శాసన సభ నియోజక వర్గానికి చెందిన వారు.కష్టించి ఆర్దికముగా ,సమాజికము గా ఉన్నత స్థితికి చేరిన వారు.పనిలో బాధ్యత, పట్టుదల,అంకితభావం ఇలా ఎన్నో విషయాలు లో వారిలో బావ సారూప్యత ఉంది.చదువు ప్రస్తుత హోదాలో ను ఓకే స్థాయి.అటువంటి మాజీ మిత్రులు స్థానిక ఎమ్యెల్సి ఎన్నికలు ఖమ్మం భరి లోభిన్న రాజకీయ పార్టీలు నుండి నిలుస్తున్నారు. వారే టిఆర్ఎస్ అభ్యర్థి తాత మధు, కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వరరావులు.వీరిద్దరి నేపథ్యం పరిశీల న చేస్తే….

తాత మధు;ఖమ్మం జిల్లా తిరుమాలయ పాలెం మండలం పిండి ప్రోలు గ్రామము..వ్యవసాయ కుటుంబం లోపుట్టి ప్రాథమిక విద్యాబ్యాసం ప్రభుత్వ పాఠశాల లో చేశారు. తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటం కు గుండె కాయ గా, ఎంతో మంది వీరులు ను తయారు చేసిన గ్రామానికి చెందిన సిపిఎం కుటుంబం లో జన్మించారు.ఎస్ ఎఫ్ ఐ ద్వారా విద్యార్థి సంఘము నాయకుడు గా రాజకీయ ప్రవేశం చేశారు.1996 వరకు సిపిఎం పూర్తికాలంకార్యకర్త,అమెరికాలో ఉన్న సిపిఎం గానే 2013 వరకు ఉన్నారు. ఎన్నో నిర్బంధం లు చవి చూసారు.ఎత్తిన జండా ధించని వ్యక్తి..కష్టించి పని చేసి ఉన్నత స్థాయి కి ఎదిగారు.పోరాట స్ఫూర్తి అణువు,అణువు ఉంది.బాధ్యత లు తీసుకొంటే కష్ట ము,నష్టము వచ్చిన ఎదురోడ్డే మనస్తత్వం..అవి అన్ని ఆయన కుటుంబం నుండి పని.చేసిన వామ పక్షం నుండి నేర్చుకోన్న లక్షణాలు..2014 లో టిఆర్ఎస్ లో చేరిన ఆయన వ్యక్తిగత పోకడ విధానం లో వామపక్ష భావాజాలం కనిపిస్తోంది. 57 ఏళ్ల వయస్సులో ను అదే స్ఫూర్తి.

రాయల నాగేశ్వరరావు: పాత పాలేరు నియోజక వర్గం లోని ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామం..ఇంజనీరింగ్ చదివారు..వ్యవసాయ కుటుంబం లో పుట్టారు.ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాల. సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల కూలి పోరాటం లో విజయం సాధించి దేశంలో నే సిపిఎం ప్రతిష్ట పెంచింది. ఆ పోరాటానికి రైతు కుటుంబానికి చెందిన రాయల నాగేశ్వరరావు కుటుంబం నాయకత్వం వహించింది. ఇంజనీరింగ్ చదివి కొంతకాలం తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం చేసి అటుతరువాత వ్యాపార రంగం లో అడుగు పెట్టారు.ప్రపంచ వ్యాపీత చర్చ జరిగిన 2007 భూపోరాటం లోను కిలకం వహించారు. ఆనాడు జులై 28 న జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాల ను ఆర్దికముగా ఆదుకోవడం లోను రాయల నాగేశ్వరరావు ముందున్నారు. ముదిగొండ భూపోరాట అమరుల స్థూపం నిర్మాణము ఆయన సౌజన్యం తోనే జరిగింది. 2008 లో ఆయన కాంగ్రెస్ లో చేరారు.నేటికి అక్కడ కమ్యూనిస్టు సాంప్రదాయం కొనసాగిస్తున్నారు.పేదల పక్ష పాతిగానే ఉన్నారు.

ఒక్కరేగురువు

తాత మధుకు,రాయల నాగేశ్వరరావు కు తర తమ తేడాలు తో ..ప్రస్తుతం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కావడం విశేషం. ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర. వెంకట వీరయ్య సిపిఎం నుండి పాలేరు ఎమ్మెల్యే గా గెలిచిన కాలం నుండి వీరిద్దరికి మంచి మిత్రుడు కూడా.ఇటువంటి అనేక అంశాలు లో ఇద్దరి మధ్య భావసారూప్యత ఉంది.అటువంటి ఇద్దరు ఇప్పుడు ఎమ్యెల్సి బరిలో ఉడటం తో స్థానిక ముగా ఉత్కంఠ కలిగిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube