కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించండి..మీ ఇంటి వాడిగా అండగా ఉంటా

- మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నే

0
TMedia (Telugu News) :

కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించండి..మీ ఇంటి వాడిగా అండగా ఉంటా

– మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ నే

– కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి

– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజ్

టీ మీడియా, నవంబర్ 7, చింతకాని : చింతకాని మండలం వందనం, కోదుమూరు,రాఘవపురం, లచ్చగూడెం,నేరడ,చింతకాని గ్రామాల్లో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారితో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు లింగాల కమల్ రాజు వెళ్లిన ప్రతి గ్రామంలో హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని తద్వారా మధిర నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామని బీఆర్ఎస్ పార్టీ మధిర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం నాడు ఉదయం చింతకాని మండలంలోని వందనం,కోదుమూరు, రాఘవపురం,లచ్చగూడెం,నేరడ, చింతకాని గ్రామాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు అందించే గెలుపు తో మీ ఇంటి వాడిగా అందరికీ అండగా నిలబడతానన్నారు.ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచి రాజకీయ లబ్ధి కోసం హైదరాబాదులో ఉండే ఎమ్మెల్యే కావాలో లేదా మీ మధ్యనే ఉంటూ మధిర లో అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలో నిర్ణయించుకోవాలన్నారు.

Also Read : ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

చింతకాని మండల వ్యాప్తంగా దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. దళిత బంధు పథకం కింద ఆర్థిక భరోసా కల్పించి మీకు అందరికీ అండగా నిలిచిన కేసీఆర్ కి కారు గుర్తుపై ఓటు వేసి మద్దతుగా నిలవాలన్నారు.మళ్లీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ బీఆర్ఎస్ అని అందులో మధిర ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు.అభివృద్ధి, సంక్షేమంలో భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబంధు,రైతు బీమా, కల్యాణ లక్ష్మి,షాది ముబారక్, దళిత బందు లాంటి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఏ సమయంలో రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి మోసపు మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలను నమ్మి ఓటేస్తే మరల కష్టాలను కొనితెచ్చుకున్న వాళ్ళమవుతామన్నారు.

Also Read : శ్రీ చైతన్య పాఠశాలలో బి హెల్తీ, బీ హ్యాపీ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం

బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో వైకుంఠధామాలు,డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పట్టణాలతో పాటుగా పరిశుభ్ర వాతావరణం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను అందించి చెత్త సేకరణ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందన్నారు.పకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు సహా సీసీ రోడ్ల నిర్మాణం ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు లింగాల కమల్ రాజు గ్రామానికి చేరుకోగానే పెద్ద ఎత్తున మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube