ఓ కొల్లాపూర్ ఓటరన్న ఎటువైపు నీ దారి
టీ మీడియా, జూన్ 11, వనపర్తి బ్యూరో : కొద్ది నెలలో ఎలక్షన్ లు ఉన్నాయి. ప్రస్తుతం కొల్లాపూర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు. ఈ తరుణంలో వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీని వారిని గెలిపించాలని ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుత MLA బీరం తనను నమ్మి అవకాశం ఇచ్చిన పార్టీకి,తనను నమ్మి గెలిపించిన ప్రజలను తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకుని వదిలేసిన రకం.
Also Read : నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే
అభివృద్ధి కోసం అని తన కుటుంబ అభివృద్ధి కోసం కేసీఆర్ ఇచ్చే ఇరవైకోట్ల పైచిలుకు పైసలకు ఆశపడి పార్టీమారి నమ్మిన జనాలను నట్టేటా ముంచాడు.
ఇకతన అనుచర ఘనమంతా ఎమ్మెల్యే అండదండలతో అందినకాడికి దోచుకుంటున్నరని కొల్లాపూర్ లో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు.ప్రతిపనికీ పైకము లేనిది ప్రతి పర్మిషన్ కు చేతులు తడపనిదే ఇక్కడ ఏది జరగదు.మొత్తానికి అభివృద్ధి అని అదే అభివృద్ధిని మరిచి ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఒక్కటే పార్టీలో ఉండి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయి వీరి ఇద్దరిమద్యలో పెదప్రజలు నష్టపోతున్నది వాస్తవం ఇప్పుడున్న ఓమాజీ నాయకుడేమో 20 సంవత్సరాలు పరిపాలించి తన పదవికాలంలో ప్రజలంటే చులకనగా భావించి తన ప్రయాణ మార్గంలో ప్రజలను పలకరించకుండా పేపర్ తన ముఖానికి కోల్లాపూర్ లో అడ్డు పెట్టుకుంటే కోల్లాపూర్ బార్డర్ దాటి పెద్దముద్దునూరులో దింపేరకం.ప్రజలకు ఏమికావాలో అనే ఆలోచన లేకుండా తన కిరాయి మనుషులకు ఇద్దరు లేదా ముగ్గురికి పెత్తనం అప్పగించి ఆ ఊరిలో వారిదే రాజ్యం వారు చెప్పిందే వేదం అనేలా వ్యవహరించిన ఘనత. కొల్లాపూర్ లో ఉన్న వనరులను సర్వం నాకేసి ఇదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అని ఆకాశంలో మేడలుకట్టేరకం అని అందరికీ తెలిసిందే కదా
సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి తెస్తానని చెప్పి నేషనల్ హైవే అప్పటి-7 ఇప్పటి -44 కాంట్రాక్టు దగ్గర కోట్లరూపాయల ముడుపులు తీసుకుని మన బ్రిడ్జి,రహదారిని మరుగున పడలా చేసింది ఈ మాజీ మంత్రి జూపల్లి కాదంటారా కొల్లాపూర్ గుట్టలపై ఉండే తెల్లటి పాలరాతి నురగవలే ఉండే రాళ్లు,ఖనిజసంపదను తన పలుకుబడితో దోచుకున్నది వాస్తవం కాదా ఇంక ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల పనితీరు ఎట్ల ఉందంటే ఎవ్వడు అధికారంలోకి వస్తే వాడిదగ్గర కొల్లాపూర్ ఆత్మాభిమానం తాకట్టుపెట్టేరకం.తనను నమ్మిన జనాలకు పంగనామాలు పెట్టేరకమా కాదా మీరే ఆలోచించుకోండి.
Also Read : డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఇంక సుధాకర్ రావు గారి విషయానికీ వస్తే తనను నమ్మి ఓట్లు వేసిన జనాలకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పదండి ఈ దోపిడీ దొంగల నుంచి కొల్లాపూర్ కీ విముక్తి కల్పిద్దాం అనీ తను ముందుండి కలుపుకుని పోతున్న నాయకుడు.
తను గెలవకపోయినా అన్నమాట ప్రకారం జాతీయ రహదారి కోసం,సోమశిల బ్రిడ్జి కోసం పదేపదే ఢిల్లీ బాటపట్టి కేంద్ర పెద్దలను కలిసి కొల్లాపూర్ కీ ఏమేమి కావాలో అవన్నీ తీసుకువచ్చన ఘనత మన ఎల్లేని సుధాకర్ రావుగారిది.
ఎంతోమంది పేదపిల్లలను చదువులకోసం హైదరాబాద్ పోయి ఉద్యోగాలకోసం డబ్బులు పెట్టి చదువుకోలేని విద్యార్థులకు తన సోంత ఖర్చులతో చదువు చెప్పించి పుస్తకాలు ఇప్పించి ఆదుకున్న ఆపద్బాంధవుడు సుధాకరన్న.
Also Read : ఘనంగా బాలకృష్ణజన్మదిన వేడుకలు
తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కొల్లాపూర్ నిరుద్యోగులకు పరిశ్రమలు మరియు రైలు మార్గం కోసం శాయశక్తులా కష్టపడి తీసుకువస్తానన్న శపతం చేసిన ఘనత ఆయనసోంతం.
ప్రజల్లారా మీరే ఆలోచించుకోండి కొల్లాపూర్ ని అమ్ముకునే నాయకులు కావాలో కొల్లాపూర్ ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు కావాల్నో మీరే ఆలోచించండి. ఎమ్మెల్యే మాజీ మంత్రి వల్ల కాలేని ఎన్నో పనులను కొల్లాపూర్ లో మన సుధాకర్ రావు వల్ల అవుతున్నవంటే అతడి చిత్తశుద్ధి ఎంతగట్టిదో ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తాడో ప్రజలు గమనిస్తున్నారు కానీ ప్రజల్లారా ఈసారి అధికార (TRS)పార్టీ నయవంచక నాయకులను నమ్మి మరియొక్కసారి మోసపోవద్దని ప్రజలు అంటున్నారు.