ఓటర్ల నమోదు అవగాహన ర్యాలీ

ఓటర్ల నమోదు అవగాహన ర్యాలీ

1
TMedia (Telugu News) :

ఓటర్ల నమోదు అవగాహన ర్యాలీ

టీ మీడియా, నవంబర్ 9, వనపర్తి బ్యూరో : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 సం.లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని, ఓటు హక్కును కలిగి ఉండాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు. బుదవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు ఓటరు నమోదు అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో ఓటరు జాబితా ముసాయిదా సిద్దం చేసి బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Also Read : బిజెపి ఏం ఎల్ ఏ రాజసింగ్ కి బెయిల్ మంజూరు

కొత్తగా ఓటర్ నమోదుకు ఫారం – 6 వినియోగించి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఫారం – 6 బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, ఫారం – 8 ద్వారా మార్పులు సవరణ, ఇంటి చిరునామా వివరాలు, దివ్యాంగులుగా గుర్తింపు వంటివి సవరించుకోవాలని ఆయన తెలిపారు. ఓటరు నమోదుకు, ఆధార్ అనుసంధానం చేయటంలో అధికారులు, విద్యార్థుల సమన్వయంతో పక్కాగా ఓటరు జాబితా రూపొందించాలని, 100 శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఐఓ.జేకైర్ హుస్సేన్, డిఈఓ. రవీందర్, డిపిఆర్ఓ రషీద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మదిలెట్టీ, ఎలక్షన్ అధికారి రమేష్, జిల్లా అధికారులు, యంఈఓ. శ్రీనివాస్ గౌడ్, సైన్స్ అధికారి శ్రీనివాస్ ,విద్యార్థులు తథితరులు పాల్గొన్నారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube