వీఆర్ఏల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

వీఆర్ఏల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

1
TMedia (Telugu News) :

వీఆర్ఏల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

టీ మీడియా, ఆగస్టు 17, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం వీఆర్ఏల నిరవధిక సమ్మె 24వ రోజు చేరిన సందర్భంగా వనపర్తి జూనియర్ కళాశాల నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ వీఆర్ఏల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వేసిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది .అనంతరం వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగిస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు జూలై 20 నుండి 22 వరకు రిలే నిరాహార దీక్షలు చేశారు.

 

Also Read : వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ

 

23న కలెక్టరేట్ ముట్టడి జరిగింది. జూలై 25 నుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మె గొంతెమ్మ కోరికలతో జరుగుతున్న సమ్మె కాదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో 2020 సెప్టెంబర్ 9న వీఆర్ఏలకు పేస్కేలు తరహా వేతనాలు ఇస్తానని, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తామని, వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, విద్యారతను బట్టి వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ జీవోలుగా మారలేదు .11వ పిఆర్సి లో 30% వేతనాలు వీఆర్ఏలకు పెంచుతారని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అమలు కాలేదు .ప్రజా ప్రతినిధులకు అదే అసెంబ్లీ సమావేశంలో వేతనాలు పెంచుతారని హామీ ఇచ్చి వేతనాలు పెంచారు .అమలు జరుగుతున్నాయి. మిగతా అంగన్వాడీలకు, ఆశలకు, హోంగార్డులకు అదే అసెంబ్లీ సమావేశంలో 30% పిఆర్సి అమలు చేస్తారని వేతనాలు పెంచారు. కానీ చిట్ట చివరన వెట్టిచాకిరి చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన తరగతులకు చెందిన వీఆర్ఏలకు మాత్రం వేతనాలు పెంచలేదు.

 

Also Read : తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ

 

కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీఆర్ఏల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని తెలిపారు. ఈ సమ్మె వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు .లేనిచో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, వీఆర్ఏల సంఘం జిల్లా జెసి నాయకులు, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి, కార్యదర్శి సురేష్, వి.ఆర్.ఏ జె.ఏ.సి చైర్మన్ సురేష్ , కో.చైర్మన్ రమేష్, వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు రాములు,రమేష్, రామ్మోహన్, అశోక్, భాగ్యలక్ష్మి,సోని,లక్ష్మీ, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube