వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

1
TMedia (Telugu News) :

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

టీ మీడియా, ఆగస్టు 10, వనపర్తి బ్యూరో : వీఆర్ఏల నిరవధిక సమ్మె బుధవారం 17వ రోజు సందర్భంగా వనపర్తి జిల్లా రైతుసంఘం ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వనపర్తి జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి ముమ్మడి పరమేశ్వరచారి మాట్లాడుతూ గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఏలకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వారసత్వంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

Also Read : వారసుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

వీఆర్ఏలు 17 రోజుల నుంచి నిరసన చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికైనా వారి సమస్యలను గుర్తించి వారికి ఇచ్చిన మాట ప్రకారంగా వారికి ఇచ్చిన హామీలను వెంటనేఅమలు చేయాలని లేనిపక్షంలో వీఆర్ఏలు తీసుకునే ఏ నిర్ణయానికైనా మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.రామాచారి, వీఆర్ఏలు సురేష్, భాగ్యమ్మ, కృష్ణవేణి, లక్ష్మి, సోనీ, నరసింహా, రాములు, లక్ష్మమ్మ సుగుణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube